Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరువులో కూరగాయల సాగే మేలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
వ్యవసాయ, ఉద్యానవన నిపుణులు కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు లాభదాయకమైన కూరగాయల సాగుపై సూచనలు చేశారు.
డిసెంబర్ నెలలో చల్లని వాతావరణం ఉన్నందున కాలీఫ్లవర్, క్యాబేజీ, టమాటా, పచ్చిమిర్చి, గ్రాఫ్టింగ్ వంకాయ, వేరు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడం మంచిదని వారు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కరువు పరిస్థితుల నేపథ్యంలో తక్కువ సమయంలో మంచి ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని వ్యవసాయ, ఉద్యానవన నిపుణులు సూచిస్తున్నారు. డిసెంబర్ నెలలో కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని పేరొంటున్నారు. ఈ నెలలో ఉండే చల్లని వాతావరణం, తకువ ఉష్ణోగ్రతలు కొన్నిరకాల కూరగాయల ఎదుగుదలకు అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు.
కాలీఫ్లవర్ (ఫూల్ గోబీ): డిసెంబర్ నెలలో సాగుకు కాలీఫ్లవర్ అత్యంత అనుకూలమైన పంట. దీనికి తకువ పెట్టుబడి (ఎకరానికి రూ.50,000 నుండి రూ.60,000) అవసరం. రైతులకు స్టేకింగ్ లేదా మల్చింగ్ వంటి అదనపు ఖర్చులు ఉండవు. తకువ అనుభవం ఉన్న రైతులు లేదా కొత్తగా వ్యవసాయం చేసేవారు కాలీఫ్లవర్ సాగును చేపట్టడం ద్వారా మంచి అనుభవాన్ని, ఆదాయాన్ని పొందవచ్చు. ఈస్ట్ వెస్ట్ దావల్ వంటి రకాలు 1.5 కిలోల వరకు సైజును సాధించగలవని సూచిస్తున్నారు. కాలీఫ్లవర్లా క్యాబేజీ కూడా డిసెంబర్లో సాగుకు అనుకూలం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)