Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఖమ్మంలో భార్యను మోసం చేసిన డాక్టర్ బాబు.. హాస్పిటల్ ముందు భార్య ఆందోళన
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
ఖమ్మం జిల్లా కల్లూరు మునిసిపాలిటీలోని మోహన్ హాస్పిటల్ ముందు కుసుమ అనే మహిళ తన మూడేళ్ళ పాపతో కలిసి ఆందోళనకు దిగింది.
డాక్టర్ మోహన్ అదనపు కట్నం కోసం వేధించాడని, తనకు తెలియకుండా విడాకులు సృష్టించాడని, వేరే మహిళతో సహజీవనం చేస్తూ వదిలేశాడని ఆమె ఆరోపించింది.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు, అయితే డాక్టర్ మోహన్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఖమ్మం జిల్లా కల్లూరు మునిసిపాలిటీలోని మోహన్ హాస్పిటల్ ముందు మూడేళ్ళ పాపతో కలిసి మహిళ ఆందోళన దిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. డాక్టర్ మోహన్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడని, తనకు తెలియకుండా విడాకులు సృష్టించాడని ఆరోపిస్తూ అతని భార్య కుసుమ ఆందోళనకు దిగింది. తనకూ, మూడేళ్ళ పాపకు స్టెరాయిడ్స్ ఇచ్చి మానసికంగా వేధించాడని ఆమె కన్నీరుమున్నీరయింది. డాక్టర్ మోహన్ వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనను, పాపను వదిలేశాడని ఆరోపించింది. పెళ్లి ఫొటోలను చూపిస్తూ న్యాయం చేయాలని మోహన్ హాస్పిటల్ ముందు బంధువులతో ఆందోళనకు దిగింది.
ఈ ఘటన కల్లూరు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వైద్యుడిపై భార్య చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీయగా, మరోవైపు ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అయితే కుసుమ చేసిన ఆరోపణలపై డాక్టర్ మోహన్ స్పందన, అధికారిక విచారణ వివరాలు తెలియాల్సి ఉంది. తనకు, తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని కుసుమ స్పష్టం చేసింది.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)