Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కొండపై ఉన్నావమ్మా అమ్మా దుర్గమ్మా..
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- Actor Allari Naresh announced the completion of filming for his upcoming devotional film 'Kanakadurga', starring Kajal Aggarwal and directed by Pradeep Maddali. He also shared a promotional song dedicated to Goddess Kanaka Durga during an event in Vijayawada.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
‘బెజవాడ కనకదుర్గమ్మకు మా నాన్న ఈవీవీ సత్యనారాయణ పరమభక్తుడు. ఎన్నో డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేసిన నేనూ.. తొలిసారి చేస్తున్న భక్తిరసాత్మక చిత్రం దుర్గమ్మది అవ్వడం, ఆ సినిమా పేరు ‘కనకదుర్గ’ కావడం నా అదృష్టం. నవరాత్రుల్లో ఎక్కడ విన్నా మార్మోగిపోయేలా ఓ పాటను కంపోజ్ చేయాలని తమన్కి చెప్పాను. ఆయన అద్భుతమైన పాటను అందించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మీ ముందుకొస్తాం’ అని అల్లరి నరేశ్ అన్నారు. ఆయన నటిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కనకదుర్గ’. కాజల్ చౌదరి కథానాయిక. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రచయిత బీవీఎస్ రవి కథను అందించి, అజిత్ ఠాకూర్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని తొలిపాట ‘అమ్మ.. కనకదుర్గ’ను విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో అల్లరి నరేశ్ మాట్లాడారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. ‘కొండపై ఉన్నావమ్మా అమ్మా దుర్గమ్మా.. అండగా నీడై ఉండే సాయం నీదమ్మ.. ఓయమ్మో పెద్దపులి ఎక్కే మాయమ్మ.. శూలమే తిప్పుతున్న శక్తే నీవమ్మ..’ అంటూ సిరాశ్రీ రాయగా, తమన్ స్వరపరచిన ఈ పాట అమ్మవారి దివ్యానుగ్రహం, శక్తి, ఆధ్యాత్మికత విశిష్టతను చాటిచెప్పేలా సాగింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)