Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
కోనసీమ ఓఎన్జీసీ బావి మంటలు అదుపులోకి! - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ బావి మంటలు చెలరేగి తీవ్ర కలకలం రేపాయి.
ఓఎన్జీసీ నిపుణుల బృందం దాదాపు 10 గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించగా, యంత్రాంగం వేగంగా స్పందించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 8 outlets · Compare coverage →
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓఎన్జీసీ గ్యాస్ బావి మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. రాజోలు నియోజకవర్గ పరిధిలోని ఒక గ్యాస్ డ్రిల్లింగ్ బావిలో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన ఓఎన్జీసీ నిపుణుల బృందం దాదాపు 10 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి మంటలను పూర్తిగా నియంత్రించింది.
నవంబర్ 17 తెల్లవారుజామున సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఈ గ్యాస్ వెల్ వద్ద అకస్మాత్తుగా భారీ శబ్దం వినిపించింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆకాశాన్ని తాకేలా చెలరేగిన అగ్నికీలలను చూసి సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్జీసీ అత్యవసర సాంకేతిక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ప్రత్యేక పరికరాలు, నిపుణుల వ్యూహాలతో తీవ్రంగా శ్రమించి, మధ్యాహ్నం సమయానికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)