Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Kotha Prabhakar Reddy | సీఎం హుందాతనాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట పర్యటనలో అభివృద్ధిపై కాకుండా కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి తిట్ల పురాణంతో సరిపెట్టారని ఆయన మండిపడ్డారు.
సీఎం స్థాయిలో హుందాతనం ఉండాలని, దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వల్ల ముఖ్యమంత్రి పదవికే గౌరవం తగ్గుతుందని ఆయన అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట పర్యటనలో ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడకుండా కేసీఆర్, హరీశ్ రావు, వారి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సీఎం పర్యటనతో తమ ప్రాంతానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు వస్తాయని, పెండింగ్ ప్రాజెక్టు కాలువలకు మోక్షం కలుగుతుందని, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతుబంధు అందుతాయని, రోడ్లు బాగుపడతాయని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తిట్ల పురాణంతో సరిపెట్టారని మండిపడ్డారు.
గజ్వేల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటేరరు ప్రతాప్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడి ప్రాంతంలోని సమస్యలను తెలుసుకునేవారని గుర్తు చేశారు. విద్యుత్, సాగునీరు, రోడ్లు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించి, అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసేవారని తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)