Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
లిఫ్ట్‌ల భద్రతకు చట్టం తీసుకురండి : హైకోర్టు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హైకోర్టు లిఫ్ట్‌లు, ఎలివేటర్ల భద్రతకు సంబంధించి బిల్లు రూపొందించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
ఎనిమిది వారాల్లో బిల్లును రూపొందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది.
రాజేంద్రనగర్‌కు చెందిన న్యాయవాది బరత్అలీఖాన్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకొని విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : లిఫ్ట్‌లు, ఎలివేటర్ల భద్రతకు సంబంధించి బిల్లు రూపొందించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై హైకోర్టు మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. బిల్లు రూపకల్పనతోపాటు ఫైళ్ల ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యంతోపాటు అసలు బిల్లు ఏ దశలో ఉందో కూడా స్పష్టత లేకపోవడంపై అసహనం వ్యక్తంచేసింది. ఎనిమిది వారాల్లో బిల్లును రూపొందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది. బిల్లును రూపొందించి మంత్రిమండలి అనుమతి తీసుకుని గవర్నరు ఆమోదానికి పంపాలని పేరొంది.
లిఫ్ట్‌ల ఏర్పాటు, నిర్వహణలో నిబంధనలు అమలు చేయకపోవడంతో పలుచోట్ల పిల్లలు, పెద్దల ప్రాణాలు పోతున్నాయంటూ రాజేంద్రనగర్‌కు చెందిన న్యాయవాది బరత్అలీఖాన్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకొన్నది. దీనిపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యామ్కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)