Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అసమగ్రంగా అఫిడవిట్ల దాఖలు..ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
హైకోర్టు డీఎస్సీ–2002 నోటిఫికేషన్ కింద హిందీ పండిట్ గ్రేడ్–2 నియామకాలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పిటిషనర్ల విషయంలో సమర్పించిన అఫిడవిట్లు అసమగ్రంగా ఉన్నాయని తేల్చిచెప్పింది.
మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థుల వ్యవహారంలో డీఈవోలు ఇచ్చిన సిఫారసులను సమర్పించేందుకు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ–2002 నోటిఫికేషన్ కింద హిందీ పండిట్ గ్రేడ్–2 నియామకాలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పిటిషనర్ల విషయంలో ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లు అసమగ్రంగా ఉన్నాయని, ఇలాంటి వాటిని సమర్థించలేమని తేల్చిచెప్పింది. మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థుల వ్యవహారంలో జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవోలు) ఇచ్చిన సిఫారసులను సమర్పించేందుకు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
డీఎస్సీ–2002 నోటిఫికేషన్ వ్యవహారంలో 2022లో కోర్టు ఆదేశాలు జారీ చేసినా అమలు కాకపోవడంతో గతేడాది సంధ్య తదితరులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ విచారణకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా వ్యక్తిగతంగా హాజరయ్యారు. పిటిషనర్లకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు అసంపూర్తిగా ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు డీఈవోలు సిఫారసులు చేశారని చెబుతుండగా, ప్రభుత్వం మాత్రం చేయలేదంటోందని.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)