Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మారిన మద్దతు లెక్కలు!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
రాజ్యాంగ సవరణల ద్వారా డీలిమిటేషన్ బిల్లును ఆమోదించడానికి అవసరమైన ప్రత్యేక మెజారిటీని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడగట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) వంటి పార్టీలు తమ వ్యతిరేకతను కొంత సడలించడం, ఏపీలోని వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వనుండటంతో ఎన్డీయే బలం పెరిగే అవకాశం ఉందని ఈ వార్త తెలుపుతోంది.
లోక్సభలో కొందరు ఎంపీల హాజరుపై ఉన్న సందిగ్ధత, ప్రతిపక్ష పార్టీల గైర్హాజరీ లేదా క్రాస్ ఓటింగ్ వల్ల బిల్లు ఆమోదానికి అవసరమైన మెజారిటీ మార్కు తగ్గే అవకాశం ఉందని కూడా ఇందులో వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
న్యూఢిల్లీ, నవంబర్ 27/(స్పెషల్ టాస్క్ బ్యూరో): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు ఆమోదముద్ర పడటం ఖాయంగానే కనిపిస్తున్నది. వివిధ రాష్ర్టాల్లో తాజాగా మారిన రాజకీయ పరిణామాలు, మొన్నటి వరకూ బిల్లుపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించిన డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీలు కొంత మెత్తబడినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్యను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడగట్టే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలా రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికి (50%) పైగా ఉండాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే.. వారిలో 360 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలపాలి. లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 245 మంది సభ్యులు సభకు హాజరైతే.. 161 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)