Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- A tragic road accident occurred in Amistapur, Mahabubnagar district, where two youths racing Thar cars collided with a bike, killing the rider, Shahana Begum (40), and critically injuring her husband, Shakir. The incident has sparked local outrage over reckless driving and dangerous road races.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది. రెండు థార్ కార్లతో రేసింగ్ చేస్తూ బైక్ను ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. షాకీర్ తన భార్య షహానా బేగం (40), కుమార్తె ఆయారాతో కలిసి బంధువు వివాహానికి వెళ్లి బైక్పై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అమిస్తాపూర్ యూపీఎస్ పాఠశాల సమీపంలో రెండు థార్ కార్లతో రేసింగ్ చేస్తున్న యువకులు వారి బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో షహానా బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో షాకీర్కు కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తల్లి ఒడిలో ఉన్న చిన్నారి ఆయారాకు స్వల్ప గాయాలయ్యాయి.