Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మళ్లీ చదువులబాటలోకి చెంచు యువతి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A tribal woman from Nagarkurnool district, Telangana, was denied her original Intermediate certificates by a corporate college over unpaid additional fees, which prevented her from pursuing higher education.
Following a report in [PUBLISHER], local officials intervened and recovered her certificates, and the ITDA Project Officer promised to arrange NEET coaching for her.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
అచ్చంపేట, నవంబర్ 6: చెంచు యువతి మళ్లీ చదువులబాట పట్టనున్నది. చదువుకోవాలనే ఆశ ఉన్నా.. పేదరికం వెంటాడింది.. డాక్టర్ కావాలనే కల ఉన్నా.. కార్పొరేట్ కళాశాల యాజమాన్యం వైఖరి అడ్డంకిగా మారింది. చివరికి చేతిలో సర్టిఫికెట్లు లేక ఉన్నత చదువులకు దూరమై అడవిబాట పట్టిన ఓ చెంచు యువతి దీనస్థితిని వివరిస్తూ ఈ నెల ఒకటో తేదీన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘అడవిగాచిన వెన్నెల.. చెదిరిన చెంచుబాలిక కల’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనం అధికారుల దృష్టిని ఆకర్షించింది. దీంతో కలెక్టరేట్, గిరిజిన సంక్షేమశాఖ, ఐటీడీఏతోపాటు ఇతర శాఖల అధికారులు స్పందించారు.
నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం కొమ్మన్పేంట చెంచు గ్రామానికి చెందిన ఆర్తి వెంకటలక్ష్మి హైదరాబాద్లోని ఆర్టీడీ సంస్థ సహకారంతో పీర్జాదిగూడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. అనంతరం ఉన్నత చదువుల కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని సదరు కళాశాల యాజమాన్యాన్ని ఆశ్రయించింది. అదనపు ఫీజు బకాయిలు ఉన్నాయంటూ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. తీవ్ర పేదరికంలో ఉన్న వెంకటలక్ష్మి ఆ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉండటంతో ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకుండాపోయింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)