Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మంచి - చెడు
By Eenadu2 min read at Eenadu
In brief
The article explores the philosophical distinction between good and bad, defining good as kindness, honesty, and societal welfare, and bad as anything that harms society or nature.
It illustrates these concepts through everyday behavioral examples and historical anecdotes like the visit of engineer M. Visvesvaraya to the Sharavathi waterfall.
The piece concludes by emphasizing that good deeds and selfless service are the only things that survive beyond death.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏది మంచి? ఏది చెడు? ఈ ప్రశ్నకు నిర్ద్వంద్వంగా జవాబు చెప్పవచ్చు. దయ, నిజాయతీ, నైతికత, న్యాయార్జన, నిబద్ధత, సమాజ శ్రేయస్సును కోరడం- మంచితనం. అది సంఘంలో శాంతిని, సంతోషాన్ని పెంపొందిస్తుంది. ఇందుకు భిన్నంగా సమాజానికి, ప్రకృతికి హాని కలిగించేదేదైనా, అది మనకు మంచి చేసేదైనా సరే, అది చెడే. ఎందుకంటే, మనం సమాజంలో భాగం కాబట్టి. దొంగతనం, మోసం చేయడం, అబద్ధాలాడటం, ఇతరులను హింసించడం వంటివి సర్వకాల సర్వావస్థలలోనూ, సమస్త ప్రపంచంలోనూ అనైతికమైనవే.
పొరుగింటి చెట్టు నుంచి చాటుగా కాయలు, పువ్వులు కోసుకునే తల్లిని చూసిన బిడ్డ దొంగతనం తప్పు కాదనుకునే అవకాశాలున్నాయి. అలాగే, భార్యాబిడ్డలను తరచూ హింసించే తండ్రిని చూస్తూ పెరిగిన పిల్లలను ఆ భయానక అనుభవాలు జీవితాంతం వెంటాడతాయి. చిన్న విషయాలకు కూడా అబద్ధాలాడే తల్లిదండ్రులను చూసిన పిల్లలకు నిజం విలువ అర్థం కాదు. సంపదను పెంచుకోవడం తప్ప పంచుకునే అలవాటు లేని ఇంట్లో పెరిగితే పరోపకారమనేదే తెలియదు. సత్ప్రవర్తన పెంపకంతోనే అలవడుతుంది. అది ఒంటబట్టాలంటే, మంచితనం అనే మూలబీజం పసితనంలోనే నాటాలి. ‘మంచి’ అనేది దివ్యౌషధం. దాన్ని సేవించిన వాడికి ఆత్మతృప్తి ఉంటుంది. మంచితనం మనిషి శోభను పెంచే అమూల్యమైన ఆభరణం. మంచి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)