Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మంత్రి ఇలాకా బోగస్ కాక!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బాధ్యతలు చేపట్టిన తర్వాత మంచిర్యాల జిల్లాలో భారీ బీమా క్లెయిమ్‌ల అక్రమాలు వెలుగుచూశాయని ఈ నివేదిక తెలిపింది.
చనిపోయినవారి పేర్లతో బోగస్ క్లెయిమ్‌లు చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా విచారణకు ఆదేశించిందని పేర్కొంది.
అయితే విచారణ పరిధిని కేవలం మంత్రి సొంత జిల్లాకే పరిమితం చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చిందని, మంత్రి మరియు శాఖ కార్యదర్శి మధ్య సీఈవో నియామకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
చనిపోయినవారిని మళ్లీ బతికిస్తూ.. వారి పేర్లతో లేబర్ కార్డులు సృష్టించి.. ఆ తర్వాత వారు మళ్లీ మరణించినట్టు డెత్ సర్టిఫికెట్లు పెట్టి బీమా సొమ్ము కొల్లగొడుతున్న మరో కొత్తకోణం వెలుగుచూసింది. బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో బయటపడ్డ ఈ భారీ స్కామ్ కార్మికశాఖ ప్రమేయంతోనే జరిగినట్టు పలు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మృతులు పునరుర్జీవం పోసుకుంటున్నట్టు కార్మిక శాఖ నివేదికల ద్వారా తెలుస్తున్నది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న బెల్లంపల్లి నియోజకవర్గంలోనే బోగస్ క్లెయిమ్‌లు అత్యధికంగా ఉండటంపై…
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన బోర్డు నిధులపై కన్నేసిన కార్మికశాఖ మంత్రి కార్యాలయమే కేంద్రంగా మారిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సొంత జిల్లా మంచిర్యాలలో కార్మిక బీమా క్లెయిమ్‌ల పేరుతో భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. దశాబ్దాల కిందట చనిపోయిన వారి పేర్లతో మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించడం, అనారోగ్య మరణాలను ప్రమాద మరణాలుగా చిత్రీకరించడం, బోగస్ ఎఫ్ఐఆర్లు, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో కోట్ల రూపాయల పరిహారం వరకు ఒక సాగుతున్నట్టు ఆధారాలు బయటపడుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)