Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Man Attacks Police With Knife | ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎన్కౌంటర్లో గాయాలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఢిల్లీలోని జామా మసీదు పోలీస్ స్టేషన్లో విచారణ కోసం తీసుకువచ్చిన నబీల్ అనే వ్యక్తి కత్తితో ఐదుగురు పోలీసులపై దాడి చేశాడు.
దాడి అనంతరం పారిపోయిన అతడు పాత ఢిల్లీలోని చిట్లీ ఖబర్ ప్రాంతంలో పోలీసుల ఎన్కౌంటర్లో గాయపడ్డాడు.
ఈ ఘటనలో ముగ్గురు పోలీసుల పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారిని ఆసుపత్రుల్లో చికిత్స కోసం తరలించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఢిల్లీ: విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన వ్యక్తి కత్తితో పోలీసులపై దాడి చేశాడు. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. పారిపోయిన ఆ వ్యక్తి పోలీస్ ఎన్కౌంటర్లో గాయపడ్డాడు. (Man Attacks Police With Knife) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నబీల్ అనే వ్యక్తి తన తల్లిని, సోదరిని వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సోమవారం మధ్యాహ్నం పోలీసులు విచారణ కోసం జామా మసీదు పోలీస్ స్టేషన్కు అతడిని తీసుకువచ్చారు.
కాగా, నబీల్ను ప్రశ్నిస్తుండగా అకస్మాత్తుగా కత్తి తీసి పోలీసులపై దాడి చేశాడు. ఆ తర్వాత ఒక బైక్ చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అతడి దాడిలో ఐదుగురు పోలీసులకు మెడ, ముఖం భాగాల్లో గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు పోలీసులను సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరో ఇద్దరు పోలీసులు సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)