Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Microsoft: కోడ్రెడ్ను యాక్టివేట్ చేసిన మైక్రోసాఫ్ట్..
By Eenadu2 min read at Eenadu
In brief
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అంతర్గతంగా అత్యంత కీలకమైన కోడ్ రెడ్ (Code Red)ను యాక్టివేట్ చేసిందని ఈ నివేదిక పేర్కొంది.
జులైలో ప్రవేశపెట్టిన ఓ సాఫ్ట్‌వేర్‌లోని లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని, దీనిని నాలుగు నెలలపాటు ఎవరూ గుర్తించలేదని సంస్థ వివరించింది.
భారత్ సహా 74 దేశాల్లోని కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు, సమస్యను వీలైనంత వేగంగా గంటలోపు పరిష్కరించాలనే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టిందని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్‌డెస్క్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) అంతర్గతంగా అత్యంత కీలకమైన కోడ్ రెడ్ (Code Red)ను ప్రకటించింది. ఇటీవలే 24 గంటలపాటు సాంకేతిక సమస్యలతో కస్టమర్లు ఇబ్బందిపడటంతో.. ప్రపంచవ్యాప్తంగా తమ సాఫ్ట్వేర్లు, సర్వీసుల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని సరిచేయడమే లక్ష్యంగా ఈ కోడ్‌ను యాక్టివేట్ చేసింది.
ఈ నెల 12, 13 తేదీల్లో తలెత్తిన సమస్య కారణంగా అవుట్‌లుక్, టీమ్స్, కోపైలట్ వంటి సేవల్లో తీవ్ర అవాంతరాలు ఎదురయ్యాయి. జులైలో ప్రవేశపెట్టిన ఓ సాఫ్ట్‌వేర్‌లో లోపం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. దీనిని నాలుగు నెలలపాటు ఎవరూ గుర్తించలేదని సంస్థ పేర్కొంది. హ్యాకింగ్ లేదా ఏఐ ఏజెంట్ల దాడి జరగలేదని నాడు సంస్థ వెల్లడించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)