Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
75వ మిస్ యూనివర్స్ పోటీల్లో ప్యూర్టో రికోకు చెందిన జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచింది.
డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మెలిస్సా నూనెజ్ తొలి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
భారత్ తరఫున పాల్గొన్న కజియా లిజ్ మెజో టాప్ 30 వరకు చేరినా, టాప్ 12లో చోటు దక్కించుకోలేకపోయింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage → · Followed over 12 days across 2 events →
Miss Universe | ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం ప్యూర్టోరికా భామను వరించింది. స్వదేశీ గడ్డపై జరిగిన 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు అందాల కిరీటాన్ని అలంకరించారు.
ఈ అందాల పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మెలిస్సా నూనెజ్ తొలి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఇక ఈ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్న 19 ఏళ్ల కజియా లిజ్ మెజో టాప్ 30 వరకు చేరినా, టాప్ 12లో చోటు దక్కించుకోలేకపోయింది. స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత ఎంపికైన 12 మంది ఫైనలిస్టుల్లో భారత్ లేకపోవడంతో ఆమె పోటీ నుంచి నిష్క్రమించింది. దీంతో భారత్ నాలుగో మిస్ యూనివర్స్ కిరీటం కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)