Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mock Parliament | జగిత్యాల జ్యోతి హైస్కూల్లో నమూనా పార్లమెంట్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ, నీట్ అకాడమీలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నమూనా పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించారు.
పాఠశాల యాజమాన్యం తెలిపిన ప్రకారం, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలు, చట్టాల రూపకల్పనపై అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో విద్యార్థులు పాఠశాల సమస్యలు, పరిశుభ్రత, క్రీడా సదుపాయాలు, విద్యార్థుల హక్కులపై చర్చించి పరిష్కారాలను ప్రతిపాదించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Mock Parliament |జగిత్యాల : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాలలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ, నీట్ అకాడమీలో నమూనా పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ విధులు, ప్రజాస్వామ్య విలువలు, చట్టాల రూపకల్పన, పాఠశాల సమస్యలపై చర్చల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆ పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఈ సమావేశంలో ప్రధాన విద్యార్థి నాయకుడు, ఉప ప్రధాన విద్యార్థి నాయకులు, సాంస్కృతిక కార్యదర్శి, క్రీడా కార్యదర్శి, క్రమశిక్షణ కార్యదర్శులు నాయకత్వం వహించారు.
పాఠశాలలోని సమస్యలు, క్రమశిక్షణ, పరిశుభ్రత, క్రీడా సదుపాయాలు, విద్యార్థుల హక్కులు వంటి అంశాలపై చర్చించి పరిష్కారాలను ప్రతిపాదించారు. గతంలో నిర్వహించిన వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, ముఖ్యంగా ఆహార పరిశుభ్రత అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ప్రస్తుత సమావేశంలో పార్లమెంట్ ప్రశ్నోత్తరాలు, బిల్లుల ప్రవేశపెట్టడం, చర్చలు, ఓటింగ్, చట్టాల ఆమోదం వంటి ప్రక్రియలను నమూనా రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరిచరణ్ రావు, శ్రీధర్ రావు, అజితా రావు, మౌనిక రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)