Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Modi- Zelenskyy: ఉక్రెయిన్- రష్యా శాంతి చర్చల వేళ.. జెలెన్స్కీకి మోదీ ఫోన్
By Eenadu2 min read at Eenadu
In brief
Prime Minister Narendra Modi spoke with Ukrainian President Volodymyr Zelenskyy by phone to discuss the Ukraine-Russia conflict and recent developments.
According to the Prime Minister's Office, Modi reiterated India's support for peaceful resolution through dialogue and its readiness to mediate, including establishing grain corridors.
Zelenskyy highlighted that this is the right time to end the war and posted about their conversation on X.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Volodymyr Zelenskyy)తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి సంబంధించిన ఇటీవలి పరిణామాలను, తమ వైఖరిని ప్రధాని మోదీకి జెలెన్స్కీ వివరించారని ప్రధాని కార్యాలయం (PMO) తెలిపింది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ (Narendra Modi) తెలియజేశారని పేర్కొంది. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలన్న వైఖరిని ఆయన పునరుద్ఘాటించారని తెలిపింది.
అదేవిధంగా భారత్- ఉక్రెయిన్ మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జెలెన్స్కీ, ప్రధాని మోదీ చర్చించుకున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ (Ukraine), రష్యాల మధ్య శాంతి చర్చలు త్వరలోనే మళ్లీ మొదలుకానున్న వేళ ఇరువురు నేతలు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి (Ukraine Crisis) ముగింపు పలికేందుకు తమ మధ్యవర్తిత్వంలో ఈ నెల 10, 11 తేదీల్లో అబుధాబీ వేదికగా శాంతి చర్చలు జరుగుతాయని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)