Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Mohan Bhagwat: సోషల్ మీడియా.. వ్యసనం లాంటిదే: మోహన్ భాగవత్
By Eenadu1 min read at Eenadu
In brief
మోహన్ భాగవత్ (Mohan Bhagwat) రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగిన ‘మారు నినాద్-2026’ కార్యక్రమంలో మాట్లాడుతూ, యువత సోషల్ మీడియాకు బానిసలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కులం, మతం పేరుతో దేశాన్ని విభజించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, భారత్ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రపంచ శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: యువత క్రమంగా సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధిపతి మోహన్ భాగవత్ (Mohan Bhagwat) పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వాడకం విపరీతంగా పెరుగుతోందని.. చివరకు అవి ఓ వ్యసనంలా మారాపోయాయని అన్నారు. వీటి వల్ల యువతలో ఉన్న నైపుణ్యాలు, సృజనాత్మకత, చైతన్యం వంటివి మరుగున పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన ‘మారు నినాద్-2026’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరం మేరకే సోషల్ మీడియాను వినియోగించాలని యువతకు సూచించారు.
ప్రజల్లో కులం, మతం పేరుతో అంతర్గత కలహాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని మోహన్ భాగవత్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇవి బ్రిటిష్ పాలనలోని ‘’ అనే విధానంలా ఉన్నాయని అన్నారు. భారత్ అభివృద్ధి మార్గంలో దూసుకుపోవడం నచ్చని కొన్ని ప్రపంచ శక్తులు.. మనపై కుట్ర పన్నుతున్నాయని అన్నారు. అటువంటి దుష్ట శక్తులకు మనలోని కొందరు వ్యక్తులు సహకరిస్తున్నారని విమర్శించారు. ధర్మం వైపు నడవాలంటే స్వార్థం అహంకారం, విభేదాలను విడనాడాలని పిలుపునిచ్చారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)