Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మూడేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఫైర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చినా మూడేళ్లుగా వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆయన ఆరోపించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల సంక్షేమ నిధి వంటి హామీలను కూడా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చౌటుప్పల్, నవంబర్ 17 : ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా హామీల అమలులో విఫలమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అభయహస్తం పేరుతో ప్రజలకు ఆశలు కల్పించిన కాంగ్రెస్ పాలన నేడు మారిందని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, వరికి రూ.500 బోనస్ వంటి హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.
ధాన్యం కొనుగోళ్లలోనూ ప్రభుత్వం , కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆరోపించారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల పింఛన్, విద్యార్థులకు విద్యా భరోసా వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల సంక్షేమ నిధి వంటి హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)