Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మురుగునీటితో రోడ్డుపై నరకం.. వెంగన్నపాలెం గ్రామస్తుల ఆందోళన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రావిచెట్టు బజార్లో మురుగునీటి సమస్యపై గ్రామస్తులు బుధవారం ఆందోళన నిర్వహించారు.
రోడ్డుపై మురుగునీరు నిల్వ ఉండటం, ఆక్రమణల వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వారు ఆరోపించారు.
అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసనను విరమించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్ - అధికారుల హామీతో నిరసన విరమణ జూలూరుపాడు, నవంబర్ 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రావిచెట్టు బజార్లో మురుగునీటి సమస్యపై గ్రామస్తులు బుధవారం ఆందోళన నిర్వహించారు. 33 అడుగుల వెడల్పు గల రహదారి ఆక్రమణకు గురికావడంతో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్డుపైనే మురుగునీరు నిల్వ ఉంటోందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వాటర్ ప్లాంట్ నుండి వచ్చే నీటితో పాటు, ఇళ్లలో వాడుకునే నీరు, సైడ్ డ్రైనేజీలోని మురుగునీరు నేరుగా రోడ్డుపైకి ప్రవహిస్తుండడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్తులు…
ఈ మార్గంలో వాహనదారులు వెళ్తున్న సమయంలో మురుగునీరు చిమ్మి బట్టలపై పడుతోందని, పాదచారులు నిత్యం బురద నీటిలోనే నడవాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు ఆక్రమణలను తొలగించి, వెడల్పు చేయడంతో పాటు శాశ్వత డ్రైనేజీని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎంపీఓ తులసీరామ్, సర్పంచ్ రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. రోడ్డుపైకి మురుగునీరు రాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)