Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
- At an MVSR Engineering College dandiya event in Hyderabad, some youths allegedly harassed a Muslim bouncer, questioning his presence at a Hindu festival. The incident was captured in a viral video, while a separate tragedy at the same venue involving a collapsing truss during the same event resulted in one student's death and 22 injuries, leading to police arrests.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల కార్యక్రమం.. నువ్వెందుకు వచ్చావ్?’ అంటూ ఓ ముస్లిం బౌన్సర్‌ను కొందరు యువకులు నిలదీశారు. ఈవెంట్ నిర్వాహకులే తనను విధులకు పంపించారని చెబుతున్నా వినిపించుకోకుండా ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుక సందర్భంగా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ దాండియా కార్యక్రమానికి నిర్వాహకులు భద్రత కోసం బౌన్సర్లను నియమించారు. వారిలో ఫరీద్ అనే కూడా ఉన్నారు. అయితే, కొందరు యువకులు ఆయనను మతం పేరుతో ప్రశ్నిస్తూ దురుసుగా మాట్లాడారు. ‘నీకు సోషల్ మీడియా ఉంది కదా.. ముస్లిం బౌన్సర్లు రావొద్దని ప్రచారం జరుగుతోంది కదా.. మరి నువ్వెందుకు వచ్చావ్?’ అని ప్రశ్నించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఆ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇలా ముస్లిం బౌన్సర్‌ను వేధించడమే కాకుండా.. తామేదో ఘనకార్యం చేసినట్లుగాగా వీడియో తీసి మరీ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.