Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నవంబర్ 24న హైదరాబాద్కు అమిత్ షా..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 24న హైదరాబాద్కు రానున్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తెలుస్తోంది.
ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని ఐటీసీ కాకతీయ హోటల్లో ఉంటారు, ఆ తర్వాత ఒక ప్రైవేట్ చానల్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.
ఈ నెల 25న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సిద్దిపేటకు రానున్నారని, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో జరిగే మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారని కూడా ఆ షెడ్యూల్ తెలుపుతోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 24న హైదరాబాద్కు రానున్నారు. ఓ ప్రైవేట్ చానల్ నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సుమారు మూడు గంటల పాటు ఈ పర్యటన సాగనున్నది. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం 5.40 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు వస్తారు.
అక్కడి నుంచి హోటల్ ఐటీసీ కాకతీయకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు హోటల్లోనే ఆయన ఉంటారు. అనంతరం రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు ఓ ప్రైవేట్ చానల్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆయన 8.50కు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. అయితే, ఐటీసీ కాకతీయలో ఉండే గంట సమయంలో బీజేపీ ముఖ్యనేతలతో పాటు పలువురు ప్రముఖులను ఆయన కలిసే ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)