Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఓటర్లకు ఈసీ కీలక ప్రకటన.. ఫాం-6తో మళ్లీ నమోదు చేసుకోవచ్చు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్లకు ఒక ప్రకటన చేస్తూ, తాజా ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారు ఫాం-6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఓటర్ల భయాందోళనలు తొలగించేందుకు స్థానిక భాషల్లో ప్రచారం చేయాలని రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఈసీ సూచించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/సర్) ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు కనిపించని వారు మరోసారి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది.గతంలో ఓటరుగా నమోదై ఉన్నప్పటికీ, తాజా ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే ఫాం-6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.ఈ విషయంలో అధికారులు విచారణ జరుపుతారేమోనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.అయితే, దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఇప్పటికే మరే ఇతర పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండకూడదని స్పష్టం చేసింది.దరఖాస్తుతోపాటు సమర్పించే డిక్లరేషన్ కూడా చట్టబద్ధంగా ఉండాలని వెల్లడించింది.
ఓటర్లకు అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలుఓటర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు స్థానిక భాషల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులను ఆదేశించినట్లు ఈసీ వెల్లడించింది.ఈ మేరకు నవంబర్ 6న ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపింది.ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించినట్లు పేర్కొంది.ఈ అంశాలపై ఎన్నికల సంఘం తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.సర్ ప్రక్రియలో భాగంగా ఏఎస్డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్) కారణాలతో ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించిన వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)