Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
SIR Voter List | ఓటర్లకు ఈసీ భారీ ఊరట.. ఫామ్-6 దాఖలు చేస్తే కేసులు పెట్టరు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) SIR ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో పాత ఓటర్లకు ఊరటనిచ్చింది.
ఫామ్ 6 దాఖలు చేసినంత మాత్రాన ఎలాంటి విచారణ ఉండదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.
అదే సమయంలో, దరఖాస్తును వేరే నియోజకవర్గంలో దాఖలు చేయకూడదని మరియు అది చట్టబద్ధంగా ఉండాలనే షరతును విధించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
SIR Voter List | న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో పేర్లు గల్లంతైన పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) భారీ ఊరటనిచ్చింది. గతంలో ఓటర్లుగా నమోదై ఉండి, ముసాయిదా జాబితాలో పేరు కనిపించకపోవడంతో తిరిగి నమోదు కోసం ఫామ్ 6 దాఖలు చేసినంత మాత్రాన ఎలాంటి విచారణ ఉండదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. గతంలో ఓటర్లుగా నమోదైనవారు ఫామ్ 6 సమర్పిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 31 కింద చర్యలు తీసుకుంటారనే ఆందోళనలు వ్యక్తమయ్యాయని ఈసీ తెలిపింది.
అయితే, వారు మరే ఇతర లోక్సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు కాకూడదని, దరఖాస్తులోని ప్రకటన చట్టబద్ధంగా ఉండాలనే షరతు విధించింది. ఈ స్పష్టతను స్థానిక భాషల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ర్టాల ఎన్నికల అధికారులను కోరింది. సర్ కు గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన, నకిలీ ఓటర్లుగా గుర్తించిన జాబితాలోని అర్హులను తిరిగి చేర్చాలని సుప్రీంకోర్టు చేసిన సూచననూ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 6న రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లు తమ నివాస ప్రాంతానికి సంబంధించిన ఈఆర్ వో, ఏఈఆర్ వో లేదా బీఎల్ వోకు ఎన్యుమరేషన్ ఫామ్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)