Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
పహల్గామ్ దాడి తర్వాత ఏం మారింది? పాక్ ఎస్సీఓ ఆహ్వానంపై కాంగ్రెస్ ఫైర్! - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ను ఎస్సీఓ సదస్సుకు ఆహ్వానించడంపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి.
పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ పట్ల కేంద్రం వైఖరిలో మార్పు ఏమిటని కాంగ్రెస్ ప్రశ్నించగా, భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం పాకిస్థాన్‌కే ప్రయోజనకరమని బీజేపీ పేర్కొంది.
ఈ సదస్సు ఢిల్లీలోని పురానా ఖిలాలో జరగనుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సుకు పాకిస్థాన్‌ను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ నెల 20 నుంచి 22 వరకు ఢిల్లీలోని పురానా ఖిలాలో ఎస్సీఓ సివిలైజేషనల్ డైలాగ్ పేరుతో ఈ సదస్సు జరగనుంది.ఇందులో పాల్గొనాలని పాకిస్థాన్‌కు కేంద్రం ఆహ్వానం పంపగా.. ఆ దేశం కూడా హాజరయ్యేందుకు అంగీకరించింది.అయితే, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏమిటంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
కేంద్రం నిర్ణయంపై రాజకీయంగా చర్చగత మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యల తర్వాత పాకిస్థాన్‌కు మంత్రి స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆహ్వానించడం ఇదే తొలిసారి.దీంతో కేంద్రం నిర్ణయంపై రాజకీయంగా చర్చ మొదలైంది. ఎస్సీఓ నిబంధనల ప్రకారం సభ్యదేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపిన క్రమంలోనే పాకిస్థాన్‌కూ ఆహ్వానం అందించినట్లు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 28న స్పష్టం చేసింది.ఈ సదస్సుకు తమ దేశం తరఫున వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ హాజరవుతారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.ఎస్సీఓ వేదికగా సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వివిధ నాగరికతల మధ్య పరస్పర చర్చలు, అవగాహన…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)