Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పరిశ్రమను మూసివేయాలంటూ రాస్తారోకో
By Eenadu||1 min read at Eenadu
In brief
Residents of Chegunta in Medak district staged a road blockade on Sunday demanding the closure of Jivaka Industries, alleging it causes severe air and water pollution and leads to crop failure.
The protesters also complained about accidents caused by the parking of industry trucks on a busy road.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చేగుంట: కాలుష్యానికి కారణమైన పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చేగుంటలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. స్థానికంగా జీవాక ఇండస్ట్రీస్ పరిశ్రమ ద్వారా వాయు కాలుష్యం ఏర్పడి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని, అలాగే నీటి కాలుష్యం ఏర్పడి పంటలు పండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బోనాల రోడ్డులో రెండు గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు. యాజమాన్యం కారణంగా ప్రజలు, రైతులు నష్టపోతున్నారని వెంటనే ఆ పరిశ్రమను మూసివేయాలని కోరారు. అలాగే నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపైన పరిశ్రమకు సంబంధించిన లారీలను నిలపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)