Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PM Modi: ‘ప్రధాని సంకల్పం దేశ రాజకీయాల్లో చారిత్రక మార్పునకు నాంది’
By Eenadu2 min read at Eenadu
In brief
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పం దేశ రాజకీయాల్లో చారిత్రక మార్పునకు నాంది పలుకుతుందని అన్నారు.
జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీట్ల పెంపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసిందని, చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని ఇంటర్నెట్డెస్క్ నివేదించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పం దేశ రాజకీయాల్లో చారిత్రక మార్పునకు నాంది పలుకుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడం అభినందనీయమన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీట్ల పెంపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు పెంచే ప్రతిపాదన సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి ఆమోదానికి సహకరించాలని కోరారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)