Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేత
By Eenadu||1 min read at Eenadu
In brief
సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి గ్రామంలో గురువారం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయుడు మార బాల్ రెడ్డి ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లాల్ సింగ్, వీడీసీ ఛైర్మన్ భైరవ రెడ్డి, నాయకులు సాయిలు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు విద్యలో మరింతగా రాణించి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఉపాధ్యాయుడు ఆకాంక్షించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి గ్రామంలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వ ఉపాధ్యాయుడు మార బాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. పదిలో కర్రోల్ల స్మితశ్రీ , గుండ్ల వైష్ణవి, ఇంటర్మీడియట్లో పైడి శ్రీహర్ష, కుప్రియాల స్రవంతిలను ఘనంగా సన్మానించారు. విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి నగదు పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు మార బాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో మరింతగా రాణించి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం — ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లాల్ సింగ్, వీడీసీ ఛైర్మన్ భైరవ రెడ్డి, నాయకులు సాయిలు, అశోక్, భైరవ రెడ్డి మోహన్ రెడ్డి తదితరులు విద్యార్థులను అభినందించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)