Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో-ఆర్టీసీ మంథ్లీ పాస్ రూ.4 వేలే
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The state government reduced the Hyderabad Metro and RTC monthly pass prices from Rs. 8,500 to Rs. 4,000, effective from Diwali on the 8th of this month.
Transport Minister Ponnam Prabhakar announced these reductions, which will save daily commuters Rs. 1,250 per month, and clarified that Rs.
3,000 and Rs. 1,000 of the monthly pass revenue will be allocated to Metro and RTC respectively.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో మెట్రో, ఆర్టీసీ మంథ్లీ పాస్ధరను రూ. 8,500 నుంచి రూ. 4వేలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ ప్రజలకు దీపావళి కానుకగా ఈ రేట్లను తగ్గించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తగ్గించిన ధరలు ఈ నెల 8న దీపావళి పండుగ నుంచే అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం నుంచి మెట్రోకు రూ. 3,000, ఆర్టీసీకి రూ. 1000 చొప్పున జమ కానున్నట్లు మంత్రి తెలిపారు.
పాస్ ద్వారా బస్సుల్లో నెలంతా ఫ్రీగా తిరగవచ్చు.. కానీ, మెట్రోలో గరిష్టంగా 50 రౌండ్ ట్రిప్పుల వరకు అనుమతి ఉంటుందన్నారు. ఇక ప్రస్తుతం రూ. 400 ఉన్న డైలీ పాస్ ధరను రూ. 275 కు తగ్గించినట్లు మంత్రి వివరించారు. ఇందులో రూ. 200 మెట్రోకు, రూ. 75 ఆర్టీసీకి జమవుతాయని చెప్పారు. ఈ పాస్ ద్వారా మెట్రోలో రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుందన్నారు. ఈ తగ్గింపు ధరలతో ప్రయాణికులపై ప్రతి నెలా రూ. 4500, డైలీ పాస్ తో రూ. 125 ఆదా అవుతాయని చెప్పారు. ప్రజల సంక్షేమం, ప్రయాణీకుల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)