Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రాహుల్ వర్సెస్ నిర్మలా.. టాటా గ్రూప్ వివాదంపై మాటల యుద్ధం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Congress leader Rahul Gandhi alleged on social media that the central government is deliberately destroying the Tata Group, accusing Prime Minister Modi and Amit Shah of ruining the conglomerate.
Union Finance Minister Nirmala Sitharaman countered his claims, criticizing him for politicizing the Tata Sons reappointment dispute and stating that commercial and legal matters should not be labeled as criminal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ అంతర్గత వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ టాటా గ్రూప్ వివాదంపై స్పందిస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్‌ను టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దని ఆమె హితవు పలికారు.
టాటా గ్రూప్ ఇంటర్నల్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘టాటా గ్రూప్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేరపూరితంగా నాశనం చేస్తోంది. ఏ వ్యాపార నాయకుడు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడటానికి సాహసించడం లేదు. మీరు ఇంకెంతకాలం మౌనంగా ఉంటారు..? చివరకు మీకు ఇదే పరిస్థితి వస్తుంది. భారతీయ వ్యాపారాలు బీజేపీకి ఆటవస్తువు కాదు. మేము అలా జరగనివ్వం. ఈ నేరాలకు న్యాయం జరిగేలా చూస్తాము’’ అని రాహుల్ పేర్కొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)