Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రామోజీరావు చిత్రపటానికి తెదేపా నేతల ఘన నివాళి
By Eenadu1 min read at Eenadu
In brief
జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తెదేపా మండలాధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్య ఆధ్వర్యంలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరు రామోజీరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తెదేపా మండలాధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్య ఆధ్వర్యంలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరు రామోజీరావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి తెదేపా నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట సీతారామయ్య మాట్లాడుతూ రామోజీ సంస్థల ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఈనాడు, ఈటీవీ మీడియా సంస్థల ద్వారా అక్షర యుద్ధం చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)