Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Ramoji Rao: అక్షరాన్ని అస్త్రంగా మలచిన మహనీయుడు
By Eenadu3 min read at Eenadu
In brief
ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుగారి 90వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితం, సాధించిన విజయాలు, పత్రికా స్వేచ్ఛ పట్ల ఆయనకున్న నిబద్ధతను ఈ వ్యాసం వివరిస్తుంది.
రామోజీరావుగారు స్వయంకృషితో ఎదిగి, మీడియా, ఆర్థిక, వినోద రంగాల్లో సంస్థలను నిర్మించారని, ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ నాయకత్వాన్ని సైతం ప్రశ్నించారని ఈ వ్యాసం పేర్కొంది.
ఆయన ఆశయాలను భావితరాలకు అందించడమే తమ లక్ష్యమని రామోజీ గ్రూప్ ప్రతినిధులు ప్రకటించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
‘ఎన్నేళ్లు జీవించాడన్న దాన్నిబట్టి ఒక మనిషి జీవితం విలువను లెక్కగట్టలేం. ఇతరుల బతుకులను ఎంతగా మార్చారు, ఎన్ని వెలుగులు పంచారు అన్నదే ఎవరి జీవితమెంత గొప్పదో చెబుతుంది’- తొమ్మిది పదుల వయసులోని వాల్టర్ సిసులును ఆయన జన్మదినం నాడు ప్రస్తుతిస్తూ నెల్సన్ మండేలా పలికిన అక్షరసత్యమిది! భౌతికంగా మనకు దూరమై ఉండకపోతే నేడు రామోజీరావుగారి 90వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని తనకెంతో ఇష్టులైన మండేలా పేర్కొన్న ప్రమాణాల ప్రకారం పరిశీలించడమే సముచితం. లోకహితమే అభిమతంగా, తెలుగు ప్రజల ప్రయోజనాల పరిరక్షణే పరమగమ్యంగా సాగిపోయిన నాన్నగారి జీవితం గొప్పదనం అగణ్యమైనది! ఆయనది వ్యక్తిగత విజయగాథ కాదు. తరతరాలకూ…
పత్రికల ప్రాథమిక లక్ష్యం ప్రజాసేవేనని స్పష్టీకరించిన మహాత్మాగాంధీ- ప్రజల మనోభావాలను ఎప్పటికప్పుడు అర్థంచేసుకుంటూ వాటికి అక్షరరూపం ఇవ్వడమే పాత్రికేయమని నిర్వచించారు. ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ వాస్తవాలను ప్రచురించడమే పత్రికల విధి కావాలని ఉద్బోధించారు. ఆ విధంగా సామాన్య జనం చేతుల్లో పాశుపతాస్త్రమైతేనే పత్రికకు సార్థకత చేకూరుతుందని మనసావాచా విశ్వసించిన రామోజీరావుగారు- ‘ఈనాడు’ రూపంలో తెలుగు ప్రజానీకానికి అలాంటి కొండంత బలాన్నే అందించారు. ప్రజలకోసం పెత్తందారులతో యుద్ధం చేయాల్సి వచ్చిన ఎలాంటి సందర్భంలోనూ ఆయన వెనకడుగు వేయలేదు!
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)