Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Raptadu case: రాప్తాడు కేసు నిందితుడి డిశ్ఛార్జ్.. జైలుకు తరలింపు
By Eenadu1 min read at Eenadu
In brief
అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన నిందితుడు హేమంత్‌ను కర్నూలు సర్వజన ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మెరుగైన చికిత్స కోసం అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
డిశ్చార్జ్ అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీసులు హేమంత్‌ను అనంతపురం జైలుకు తరలించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కర్నూలు: అనంతపురం జిల్లా రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌ను కర్నూలు సర్వజన ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్ఛార్జ్ చేశారు. హేమంత్‌కు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉండడంతో ఈ నెల 13న రాత్రి మెరుగైన చికిత్స కోసం అనంతపురం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాలజీ విభాగంలో 5 రోజుల పాటు చికిత్స అందించడంతో నిందితుడు కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. డిశ్ఛార్జ్ అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య హేమంత్‌ను అనంతపురం జైలుకు పోలీసులు తరలించారు.
రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో హేమంత్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం పరారీలో ఉన్న నిందితుడు ఆత్మకూరు అటవీప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో పోలీసులపై దాడి చేసి.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు హేమంత్ మోకాళ్లపై కాల్పులు జరపడంతో తీవ్రగాయాలయ్యాయి. నిందితుడికి కొన్నిరోజులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలు తీసుకొచ్చారు. కోలుకోవడంతో వైద్యులు తాజాగా డిశ్ఛార్జ్ చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)