Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Former TDP MLA Gunda Laxmidevi resigned from the party and joined YSRCP in the presence of party president YS Jagan at the YSRCP central office in Tadepalli.
She stated that her family had served TDP for four decades but was betrayed by the party.
Several other TDP followers also joined YSRCP alongside her.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో అధికార టీడీపీ (TDP)కి తగిలింది. టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ( Gunda Laxmidevi) టీడీపీకి రాజీనామా (Resign ) చేసి వైసీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గుండా లక్ష్మీదేవి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా గుండా లక్ష్మీదేవికి వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
లక్ష్మీదేవి మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీ తన కుటుంబం ఎంతగానో సేవ చేసిందని తెలిపారు. సేవలను మరిచిపోయి తమను పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల కోసం ఎవరుంటే వారితో ఉండాలనుకున్నాను అని అన్నారు. ఆమె భర్త, దివంగత మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లక్ష్మీదేవితో పాటుగా ఆమె ముఖ్య అనుచరులు కూడా వైఎస్సార్సీపీలో చేరారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)