Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రూ.1,500 కోట్లతో ‘వింటేజ్ కాఫీ ప్లాంట్’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వర్గల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ రూ.1,500 కోట్లతో ఫ్రీజ్ డ్రైడ్ ఇన్స్టంట్ కాఫీ ప్లాంట్‌ను నిర్మించనుంది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు ఈ ప్లాంట్ తొలిదశకు భూమిపూజ చేశారు.
ఈ ప్లాంట్ ద్వారా ఏటా 5,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి జరగనుందని, కొత్తగా వెయ్యి మందికి ఉపాధి లభించనుందని ఆయన వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్’ ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో సుమారు రూ.1,500కోట్లతో రెండు దశల్లో ‘ఫ్రీజ్ డ్రైడ్ ఇన్స్టంట్ కాఫీ’ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఏటా 5,500మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో తొలిదశలో ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దక్షిణాసియాలోనే మొట్టమొదటి సారిగా అత్యంత అధునాతమైన రోటో టెక్నాలజీని ఈ ప్లాంట్ వినియోగించనున్నట్టు, కొత్తగా వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనున్నట్టు వివరించారు. 2027 నాటికి ఈ ప్లాంట్ సామర్థ్యం 11వేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పలు దేశాలకు ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఫ్రీజ్ డ్రైడ్ ఇన్స్టంట్ కాఫీ ఎగుమతి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ తాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)