Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చందుపట్ల గ్రామంలో కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి వర్ధంతిని ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు.
గ్రామ సర్పంచ్ కోరిన మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, సాంస్కృతిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన సభలో ఎమ్మెల్యేకు జ్ఞాపకం అందజేసి సన్మానించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
- చందుపట్ల చరిత్రను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా – నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం – రుద్రమదేవి మరణ వివరాలు తెలిపే శిలాశాసనానికి ఘన నివాళి – గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వర్ధంతి సభ నకిరేకల్, నవంబర్ 27 : కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి వర్ధంతిని ఇకపై ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం రాణి రుద్రమదేవి 737వ వర్ధంతి సందర్భంగా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని రాణి రుద్రమదేవి మరణ వివరాలను తెలిపే శిలాశాసనం వద్ద ఆయన ఘన నివాళి అర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో…
వరంగల్ కోట వేదికగా జరిగే కాకతీయ ఉత్సవాలు, ఇతర అధికారిక కార్యక్రమాల తరహాలోనే చందుపట్లలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు జరిగేలా చూడాలని గ్రామ సర్పంచ్ కోరిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ అంశాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, సాంస్కృతిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి చందుపట్ల చరిత్రకు తగిన గుర్తింపు లభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు రాణి రుద్రమదేవి జ్ఞాపకం అందజేసి సన్మానించారు. సర్పంచ్ లతా వెంకటాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మేడవరపు అశోక్ రావు, ఉప సర్పంచ్ మంజుల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)