Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సంబంధం ఉన్న పోలీస్ అధికారిని.. ముగ్గురితో కలిసి హత్య చేసిన మహిళా కానిస్టేబుల్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
గుజరాత్లోని అరవల్లి జిల్లాలో ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ తనతో వివాహేతర సంబంధం ఉన్న ఏఎస్ఐని హత్య చేసిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
ఆ అధికారి మృతదేహాన్ని కారులో ఉంచి నిప్పంటించి సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించగా, అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆమె ముఖం, చేతులు కాలిపోయాయని ఒక పోలీస్ అధికారి తెలిపారు.
అనంతరం ఆ మహిళా కానిస్టేబుల్, ఆమె సోదరుడు, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని నివేదిక పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అహ్మదాబాద్: వివాహేతర సంబంధం ఉన్న పోలీస్ అధికారిని ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ హత్య చేసింది. మరో ముగ్గురితో కలిసి ఆయన కారులో మృతదేహం ఉంచి నిప్పంటించింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళా కానిస్టేబుల్, ఆమె సోదరుడు, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. (Woman Constable, 3 Others Kill Cop) గుజరాత్లోని అరవల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల ఏఎస్ఐ అశ్విన్భాయ్ తబియాద్, 37 ఏళ్ల మహిళా హెడ్ కానిస్టేబుల్ అల్ఫాబెన్ కెలాస్వా కలిసి సబర్కాంత జిల్లాలోని చిథోడా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు.
కాగా, నవంబర్ 10న అరవల్లి జిల్లాలోని భిలోడా ప్రాంతంలో పూర్తిగా కాలిన మారుతి ఎర్టిగా కారును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కారులో కాలిపోయిన మానవ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించి పోస్ట్మార్టం కోసం తరలించారు. కారు నంబర్ ప్లేట్, డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా మృతుడిని ఏఎస్ఐ అశ్విన్భాయ్ తబియాద్గా గుర్తించారు. తొలుత ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఏఎస్ఐ సోదరుడు ఫిర్యాదుతో నవంబర్ 16న హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. మహిళా హెడ్ కానిస్టేబుల్ అల్ఫాబెన్, మరో ముగ్గురిని నిందితులుగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)