Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
శిలాజ ఇంధనాలపై కుదరని ఏకాభిప్రాయం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
తుర్కియేలోని అంటల్యాలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్-31) ఆదివారం కీలక ఒప్పందం లేకుండానే ముగిసింది.
బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం నుంచి వైదొలగే అంశంపై తుది ప్రకటనలో చేర్చాలా వద్దా అనేదానిపై వివిధ దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి.
పేద దేశాలకు ఆర్థిక సాయం, వాతావరణ మార్పులపై కార్యాచరణ వంటి అంశాలు వచ్చే ఏడాది ఇథియోపియా సదస్సుకు వాయిదా పడ్డాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అంటల్యా: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భూతాపం కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై వివిధ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తుర్కియేలోని అంటల్యాలో రెండు వారాలపాటు జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్-31) ఆదివారం కీలక ఒప్పందం లేకుండానే ముగిసింది. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం నుంచి వైదొలగే అంశాన్ని తుది ప్రకటనలో చేర్చాలా? వద్దా? అనేదానిపై విభేదాలు తలెత్తాయి.
తుర్కియే, ఆస్ట్రేలియా రూపొందించిన ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు వ్యతిరేకించాయి. రష్యా, సౌదీ అరేబియా శిలాజ ఇంధనాల ప్రస్తావనను వ్యతిరేకించాయి. 2023లో దుబాయ్ సదస్సులో శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా వైదొలగాలని నిర్ణయించినప్పటికీ ఆ తర్వాతి చర్చల్లో దీనిపై స్పష్టత కొరవడింది. కార్బన్ క్యాప్చర్, నిల్వకు ప్రాధాన్యమివ్వడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పేద దేశాలకు ఆర్థిక సాయం, వాతావరణ మార్పులపై కార్యాచరణ వంటి అంశాలు వచ్చే ఏడాది ఇథియోపియా సదస్సుకు వాయిదా పడ్డాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)