Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
AI killer robots: ఏఐ ‘కిల్లర్ రోబో’లకు కళ్లెం పడేనా..?
By Eenadu2 min read at Eenadu
In brief
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమమేధ ఆధారిత కిల్లర్ రోబోలు మరియు డ్రోన్లపై ఆందోళన వ్యక్తమవుతోందని, వీటిపై నియంత్రణ ఉండాలనే వాదనలు వినిపిస్తున్నాయని ఈ వ్యాసం నివేదిస్తోంది.
ఐరాస వేదికగా జరిగిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, వచ్చే రెండేళ్లలోపు కొత్త నిబంధనల కోసం మరిన్ని చర్చలు జరపడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి.
128 దేశాలు నియంత్రణలకు మద్దతుగా నిలిచినా, రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పూర్తి స్థాయి ఒప్పందం జరగకుండానే చర్చలు ముగిశాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమమేధ ఆధారిత ‘’ (Killer Robots)లు, డ్రోన్లపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోన్న తరుణంలో వీటిపై నియంత్రణ ఉండాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం కఠినమైన నిబంధనలను రూపొందించేందుకు ఐరాస వేదికగా జరిగిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. అయితే, వీటికి సంబంధించి వచ్చే రెండేళ్లలోపు కొత్త నిబంధనలను తీసుకురావడానికి మరిన్ని చర్చలు జరపడానికి మాత్రం ప్రపంచ దేశాలు అంగీకరించాయి.
స్వయంగా లక్ష్యాలను గుర్తించి, వాటిపై దాడి చేసి ధ్వంసం చేయగల సామర్థ్యమున్న ఆయుధ వ్యవస్థలను కిల్లర్ రోబోలుగా వ్యవహరిస్తారు. అయితే, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అనేక దేశాలు సహా స్వచ్ఛంద సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకోసం చట్టబద్ధమైన నిబంధనలు రూపొందించే ప్రక్రియను నీరుగారుస్తున్నారని 300 సంస్థల ‘స్టాప్ కిల్లర్ రోబోట్స్’ కూటమి విమర్శిస్తోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జెనీవా వేదికగా వారంపాటు జరిగిన సదస్సులో ఇదే అంశంపై చర్చలు జరిగాయి. ఇందులో 128 దేశాలు పాల్గొనగా.. దాదాపు వంద దేశాలు కిల్లర్ రోబోల నియంత్రణలకు మద్దతుగా నిలిచాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)