Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సింగరేణి అధికారులకు దసరా కానుక..కోల్ ఇండియా తరహా వేతనాల పెంపునకు సింగరేణి ఉత్తర్వులు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- Singareni Collieries Company issued orders to implement pay scales similar to Coal India for its executive cadre officers. Deputy Chief Minister Bhatti Vikramarka announced this as a Dussehra gift, resolving a long-standing demand. The revised basic pay will be effective from January 1, 2017, and the financial benefits will be applicable from September 25, 2026, subject to the board's approval.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, వెలుగు: కోలిండియా తరహా వేతనాలను అమలు చేస్తూ సింగరేణి యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరిస్తూ సింగరేణి అధికారులకు అందించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. పెరిగిన వేతనాలను అక్టోబర్ నెల జీతాల నుంచి చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్–1 నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాడర్–7 వరకు ఉన్న సుమారు 1,800 మంది అధికారులకు ప్రయోజనం చేకూరనుంది. సవరించిన బేసిక్ వేతనాలు 2017 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఆర్థిక ప్రయోజనాలు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిన 2026 సెప్టెంబర్ 25 నుంచి…
కోలిండియాలో వేతన అసమానతల నేపథ్యంలో, మహారత్న సంస్థల వేతన విధానాన్ని తమకూ అమలు చేయాలని అక్కడి అధికారులు కోరారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోలిండియా యాజమాన్యం ఆమోదం తెలిపాయి. ఇదే విధానాన్ని సింగరేణిలోనూ అమలు చేయాలని సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, దసరాలోపు చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జులైలో సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో ఈ అంశంపై యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంది.