Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సింహాచలంలో ఇక సంప్రదాయ దుస్తులతోనే దర్శనానికి అనుమతి
By Eenadu1 min read at Eenadu
In brief
Temple Executive Officer Jalepalli Venkatarao stated that men must wear traditional attire like dhotis and kurtas, while women must wear sarees or salwar kameez, and modern or western clothing will not be permitted for entry.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానంలో సుదీర్ఘ కాలంగా చర్చ సాగుతున్న డ్రెస్ కోడ్ నిబంధనను అమలు చేయడానికి అధికారులు ఎట్టకేలకు సన్నాహాలు చేశారు. ఇటీవల జరిగిన దేవస్థానం ధర్మకర్తల మండలిలో ఆమోదం పొందడంతో త్వరలోనే అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇకపై అప్పన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. దర్శనానికి వచ్చే పురుషులు ధోతి, పంచె, కుర్తా పైజామా, సాధారణ ప్యాంట్, షర్ట్, మహిళలు చీర, లంగా ఓణీ, దుపట్టాతో కూడిన చుడీదార్ ధరించాలన్నారు. బాలలు అసభ్యతకు తావులేని సంప్రదాయ దుస్తులు ధరించాలన్నారు.
ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజల్లో పాల్గొనే పురుషులు తప్పనిసరిగా ధోతీ, పంచె, కుర్తా, పైజామా ధరించాలన్నారు. మహిళలు చీర, లంగా ఓణీ, దుపట్టా ధరించిన చుడీదార్లు మాత్రమే ధరించాలని సూచించారు. నిక్కర్లు, షార్టులు, టీషర్టులు, స్లీవ్‌లెస్ టాప్‌లు, మోడ్రన్, వెస్ట్రన్ దుస్తులు ధరించి వచ్చే భక్తులకు ఆలయ ప్రవేశానికి అనుమతి లేదని తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడడంతో పాటు ఆధ్యాత్మిక, సనాతన సంస్కృతి పరిరక్షణలో భాగంగా నియమావళి అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. దుస్తుల నిబంధనలపై భక్తులందరికీ అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఈవో తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)