Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Suvendu Adhikari | మోదీతో కలిసి పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు: సువేందు అధికారి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనకు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేయాలని సలహా ఇచ్చారని పేర్కొన్నారు.
సువేందు అధికారి టీఎంసీని ఒక ప్రైవేట్ సంస్థగా ఆరోపించారు మరియు మీడియాతో మాట్లాడుతూ తాను అక్కడ ఉద్యోగిగా ఉండనని చెప్పారు.
2012 నుంచి 2017 వరకు రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ 2020లో కన్నుమూశారు, కానీ ఆయన ఈ సలహా ఎప్పుడు ఇచ్చారో సువేందు అధికారి వెల్లడించలేదు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి బయటపెట్టారు. రాజకీయాల్లో తన సొంత బలంతో ఎదగాలనుకుంటే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని వీడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేయాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనకు సలహా ఇచ్చారని ఆయన తెలిపారు. (Suvendu Adhikari) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నడుపుతున్న టీఎంసీ ఒక ప్రైవేట్ సంస్థ అని సువేందు అధికారి ఆరోపించారు. ‘నేను కూడా అక్కడ ఉన్నాను. కానీ నేను ఉద్యోగిగా ఉండను, అందుకే బయటకు వచ్చేశాను’ అని మీడియాతో అన్నారు.
కాగా, తన రాజకీయ పరివర్తనకు మార్గనిర్దేశం చేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సువేందు అధికారి ప్రశంసించారు. ‘నాకు మొదట సలహాదారుగా ఉన్నది దివంగత ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత రైసీనా హిల్స్‌కు నేను వెళ్లాను. అప్పుడు నా మేనల్లుడు కూడా నాతో పాటు వచ్చాడు. ప్రణబ్ నాతో ఇలా అన్నారు. ఎక్కువగా ఏమీ చెప్పకుండా, ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆలోచించుకో. ఒకవేళ నువ్వు ఉద్యోగిగానే ఉండిపోవాలనుకుంటే, ఆమె దగ్గరే ఉండిపో. ఒకవేళ నీ సొంత శక్తితో ముందుకు వెళ్లాలనుకుంటే, అప్పుడు మోదీ దగ్గరకు వెళ్లు’ అని నాకు సూటిగా సలహా ఇచ్చారు’ అని అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)