Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
స్వాతంత్ర్య సమరయోధుని సతీమణి లీలావతి మృతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
లీలావతి, నాగర్కర్నూల్ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు సినిమా శేఖరయ్య సతీమణి, వృద్ధాప్య కారణాలతో మరణించారు.
ఆమె నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన భర్తకు అండగా నిలిచారు.
ఆమె మృతి పట్ల స్థానిక ప్రముఖులు మరియు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలు సంతాపం వ్యక్తం చేశాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ పట్టణానికి చెందిన స్వతంత్ర సమరయోధులు, కీర్తిశేషులు సినిమా శేఖరయ్య సతీమణి అంబటి లీలావతి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమా శేఖరయ్య నాగర్కర్నూల్ ప్రాంతంలోనే సుపరిచితమైన స్వాతంత్ర్య సమరయోధుడు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. హైదరాబాద్ సంస్థాన విమోచనం కోసం అజ్ఞాతంలో ఉంటూ పోరాటం చేశారు.
స్వాతంత్ర్యం వచ్చాక కూడా సాధారణ జీవితం గడుపుతూ తన చివరి శ్వాస వరకు దేశభక్తిని, నిస్వార్థ సేవలను చాటారు. భారత ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆయనను స్వాతంత్ర్య సమరయోధునిగా గుర్తించి సత్కరించాయి. నాగర్ కర్నూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయనకు ప్రత్యేక గౌరవం దక్కేది. ఆయన సతీమణిగా లీలావతి కూడా భర్త పోరాటానికి అండగా నిలిచి కుటుంబాన్ని నడిపించారు. లీలావతి మృతి పట్ల పట్టణ ప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలు, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)
