Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తప్పుడు అఫిడవిట్లపై పౌరులు ఫిర్యాదు చేయొచ్చు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- The Supreme Court bench of Justices Dipankar Datta and Hima Kohli clarified that private citizens can file criminal complaints under the Representation of the People Act if elected candidates submit false details in their election affidavits.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
న్యూడిల్లీ, అక్టోబర్ 16 : ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పిస్తే దానిపై ప్రజాప్రతినిధుల చట్టం కింద ప్రైవేట్ పౌరులు క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేయవచ్చునని శుక్రవారం జస్టిస్లు దీపాంకర్ దత్తా, షీల్ నాగులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటువంటి కేసుల్లో ఫిర్యాదు దాఖలు చేసేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 195 కింద ఉన్న ఆంక్షలు అడ్డుకావని సుప్రీంకోర్టు పేర్కొంది. సంబంధిత కోర్టు అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేస్తే తప్ప కొన్ని నిర్దిష్ట క్రిమినల్ నేరాలను క్రిమినల్ కోర్టులు నేరుగా విచారణకు స్వీకరించకుండా ఆ క్రిమినల్…
హైకోర్టు పేర్కొన్నట్టుగా ఆర్వోపీ చట్టంలోని సెక్షన్ 125 ఏ కింద నేరం జరిగిందని ఆరోపిస్తూ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదులు పీఆర్పీవోలోని సెక్షన్ 195 కింద కఠినమైన నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామని ధర్మాసనం తెలిపింది ఒక వేళ ఎన్నికైన అభ్యర్థిని వేధించడానికి ఫిర్యాదు చేసినా, నిరాధారమైన ఆరోపణలు చేసినా పరిస్థితులకు అనుగుణంగా తాము సముచితంగా భావించి ఉత్తర్వులు జారీ చేయడానికి సమర్థులైన మెజిస్ట్రేట్లకు దేశ చట్టాలు తగిన అధికారాన్ని సామర్థ్ధ్యాన్ని కల్పిస్తాయని ధర్మాసనం పేర్కొంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)