Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Temparature | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయన్న భారత వాతావరణ కేంద్రం..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్ర విభాగం రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని వెల్లడించింది.
డిసెంబర్ మూడు వరకు పొడి వాతావరణం కొనసాగుతుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ అర్బన్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 15 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Temparature : రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో రానున్న ఐదు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్ర విభాగం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆకాశం మేఘావృతమై ఉండటం కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి.
అయితే డిసెంబర్ మూడు వరకు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తన ఏడు రోజుల సూచనలో పేర్కొన్నది. దాంతో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టనున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ గణాంకాల ప్రకారం.. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ అర్బన్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 15 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)