Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
టోటల్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ అదుర్స్.. డచ్ ఆటగాడిపై విజయం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
బుడాపెస్ట్‌లో జరిగిన టోటల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టూర్ పైలట్ క్లాసిఫికేషన్ గేమ్స్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి నెదర్లాండ్స్‌కు చెందిన జోర్డెన్ వాన్ ఫోరెస్ట్పై గెలిచాడు.
21 నుంచి 24 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లలో ప్రజ్ఞానంద నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్పై నెగ్గాడు.
అదే మ్యాచ్‌లలో గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి అభిమన్యు మిశ్రా చేతిలో ఓడిపోయింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
బుడాపెస్ట్: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. టోటల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టూర్ పైలట్ క్లాసిఫికేషన్ గేమ్‌ల్లో సత్తా చాటాడు. 9, 12 స్థానాల కోసం బుధవారం జరిగిన పోరులో అర్జున్.. జోర్డెన్ వాన్ ఫోరెస్ట్ (నెదర్లాండ్స్)పై గెలిచాడు. నాలుగు బ్లిట్జ్ గేమ్‌ల్లో మూడింటిని, రెండు ర్యాపిడ్ గేమ్‌ల్లో రెండింటిని అర్జున్ సొంతం చేసుకున్నాడు. ఫాస్ట్ క్లాసిక్ గేమ్ డ్రా కాగా.. మొత్తంగా అర్జున్ 11.5–8.5 తేడాతో విజయం సాధించాడు.
21 నుంచి 24 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌ల్లో ప్రజ్ఞానంద ఆరంభంలో వెనుకబడినా.. తర్వాత పుంజుకున్నాడు. బ్లిట్జ్ రౌండ్ ముగిసేసరికి 1–3తో వెనుకంజలో ఉన్న ప్రజ్ఞా తొలి ర్యాపిడ్ గేమ్‌లో నెగ్గి, ఫాస్ట్ క్లాసిక్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దాంతో 11–9తో నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్పై నెగ్గాడు. గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి 7–13తో అభిమన్యు మిశ్రా చేతిలో ఓడింది. రెండు బ్లిట్జ్, ర్యాపిడ్ గేమ్‌ల్లో వైశాలి పరాజయం చవిచూసింది.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)