Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Telangana government is moving to reduce the number of government schools from 26,000 to 4,000 by merging smaller local schools into 134 newly sanctioned Telangana Public Schools (TPS) starting in 2027-28.
Educational department directives require nearby Mandal Parishad, Zilla Parishad, and welfare residential schools to be brought under the TPS umbrella, drawing widespread concern and criticism from teacher unions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) విషయంలో ఊహించిన ఉపద్రవమే ముంచు కొచ్చింది. రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లను 4 వేలకు కుదిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాటలు నిజమవుతున్నాయి. తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులు అమలవుతున్నాయి. సర్కార్ బడులను చేసేందుకు విద్యాశాఖ వేగంగా పావులు కదుపుతున్నది. ఉన్న స్కూళ్లను మూసి వేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 134 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను (క్యూర్ ఏరియాలోవి కలిపి) ప్రభుత్వం మంజూరు చేసింది. మరో నాలుగింటికి సంబంధించిన అనుమతులు రావాల్సి ఉన్నది. 2027-28 విద్యాసంవత్సరంలో వీటిని ప్రారంభించాలని పాఠశాల…
అంతేకాదు.. టీపీఎస్లకు సమీపంలోని ఇతర స్కూళ్లను విలీనం చేయాలని ఆదేశించింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లు, మాడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలను ఒకే గొడుగు కిందికి తీసుకు రావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టంచేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో విద్యనందించేం దుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విలీనం ఉండబోదని గతంలో చెప్పినా, తాజాగా ఉత్తర్వులతో స్కూళ్ల మూసివేత కోసమే ప్రభుత్వం టీపీఎస్లను తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)