Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
TTD EO | శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ ఈవో పట్టువస్త్రాల సమర్పణ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
తిరుపతిలో ఉన్న టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం తమిళనాడులోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ జాయింట్ కమిషనర్ ప్రకాష్, ప్రధానార్చకులు ఈవోకు స్వాగతం పలికారు.
2006 నుంచి టీటీడీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని, ఈ కార్యక్రమంలో ఇతర ఆలయ అధికారులు కూడా పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తిరుపతి : తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ( Srirangam Sri Ranganathaswamy) వారికి శుక్రవారం టీటీడీ ఈవో ( TTD EO ) ముద్దాడ రవిచంద్ర సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు ( Silks Cloths) సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీరంగం ఆలయానికి చేరుకున్న టీటీడీ ఈవోకు ఆలయ జాయింట్ కమిషనర్ ప్రకాష్, ప్రధానార్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి తీసుకెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారు.
స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఈవోకు తీర్థప్రసాదాలు అందజేశారు. తమిళ కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని 2006 నుంచి టీటీడీ ప్రతి ఏటా శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. ప్రాచీన శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అదేవిధంగా, తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం ఆలయం నుంచి కూడా ప్రతి ఏటా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ బొక్కసం ఇన్చార్జి గురురాజస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)