Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయంలో ఘనంగా ఆయుధపూజ
By Eenadu1 min read at Eenadu
In brief
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో గురువారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తితిదే సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, గత రెండేళ్లలో అన్నప్రసాద ట్రస్టుకు సుమారు రూ.1,100 కోట్లు విరాళాలు అందాయని, తరిగొండ వెంగమాంబ కేంద్రంలో రోజుకు 90 వేల నుంచి లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తిరుమల: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో గురువారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తితిదే సాధికారిక మండలి ఛైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని ఈవో, అదనపు ఈవోలు సన్మానించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు అన్నప్రసాద సేవ కూడా యాత్రలో ముఖ్యమైన భాగమన్నారు. గత రెండేళ్లలో అన్నప్రసాద ట్రస్టుకు సుమారు రూ.1,100 కోట్లు విరాళాలు అందాయని, మొత్తం విరాళాల్లో 53 శాతానికి పైగా అన్నప్రసాద ట్రస్టుకే లభించాయన్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 90 వేల నుంచి లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో మురళీకృష్ణ, అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, క్యాంటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)