Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Uber co founder: ఎన్విడియా కార్యాలయం వద్ద నిరసన చేపడతా: ఉబర్ సహ వ్యవస్థాపకుడు
By Eenadu2 min read at Eenadu
In brief
Uber సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా ఎన్విడియా ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపడతామని ప్రకటించారు.
గతంలో ఉబర్ నుంచి తాను నిష్క్రమించిన ఘటనను, జెన్సన్ ప్రస్తుత పరిస్థితిని ఆయన పోల్చారు.
ఎన్విడియా బోర్డుకు మద్దతుగా పలువురు టెక్ లీడర్లు మరియు లక్షలాది మంది ప్రజలు బహిరంగ లేఖ రాశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
ఇంటర్నెట్ డెస్క్: ఎన్విడియా (Nvidia) సీఈఓగా మళ్లీ జెన్సన్ హువాంగ్ను నియమించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయంపై తాజాగా ఉబర్ సహ-వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ (Travis Kalanick) స్పందిస్తూ.. కీలక ప్రకటన చేశారు. జెన్సన్కు మద్దతుగా ఎన్విడియా ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగులు, ఇతర వ్యాపారవేత్తలు, టెక్ అధినేతలతో కలిసి తాను ఆందోళన చేపడతానన్నారు. ఫలితం మన చేతుల్లో లేనప్పటికీ.. ఈ విషయంలో శక్తికొద్దీ పోరాడదామని పిలుపునిచ్చారు.
జెన్సన్ పరిస్థితిని ట్రావిస్ (Uber co-founder) 2017లో తాను ఉబర్ నుంచి నిష్క్రమించిన ఘటనతో పోల్చారు. గతంలో ఓ మాజీ ఉద్యోగి సంస్థలో లైంగిక ఆరోపణలు లేవనెత్తడం, పని వాతావరణంలో వివాదాలు, వాటిపై తాను ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు చేయడంతో సంస్థ నుంచి వైదొలగాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఉబర్‌లో తనను తిరిగి నియమించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించిన 2017 నాటి వార్తా నివేదికల స్క్రీన్షాట్లను ఇటీవల జెన్సన్కు పంపినట్లు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)